ఘనంగా గన్నేరువరం మండల పదో వార్షికోత్సవం

కేక్‌ కట్‌ చేసి సంబరాలు.. మండల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపు గన్నేరువరం, అక్టోబర్‌ 11 (చైతన్యగళం): గన్నేరువరం మండలం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యువజన సంఘం నాయకుడు సందవేని ప్రశాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, యువకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ఏర్పాటుకు కృషి చేసిన నాయకులను స్మరించుకున్నారు. గన్నేరువరం మండలం మరింత అభివృద్ధి చెందాలని,...