CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:51 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా గన్నేరువరం మండల పదో వార్షికోత్సవం

  • కేక్‌ కట్‌ చేసి సంబరాలు.. మండల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపు

గన్నేరువరం, అక్టోబర్‌ 11 (చైతన్యగళం): గన్నేరువరం మండలం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యువజన సంఘం నాయకుడు సందవేని ప్రశాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, యువకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మండల ఏర్పాటుకు కృషి చేసిన నాయకులను స్మరించుకున్నారు. గన్నేరువరం మండలం మరింత అభివృద్ధి చెందాలని, మండలంలోని అన్ని గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల ఐక్యత, యువత భాగస్వామ్యం, సమష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గన్నేరువరం గ్రామ సర్పంచ్‌ రంగనవేణి లచ్చినర్సు, ఉప ఎంపీపీ న్యాత సుధాకర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, జీఎంవైఎస్‌ అధ్యక్షుడు కాలువ నాగరాజు యాదవ్‌, సీపీఐ నాయకుడు కాంతాల అంజిరెడ్డి, కాంగ్రెస్‌ మండల నాయకులు బుర్ర తిరుపతి గౌడ్‌, కవ్వంపల్లి రాజయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు మచ్చ సాయికృష్ణ, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్‌, తేల్ల సంతోష్‌, మీసం రాములు యాదవ్‌, సమ్మెట అనిల్‌, బూర శ్రీనివాస్‌, గంట గౌతమ్‌, రంగనవేణి దేవరాజ్‌, ఏలేటి ప్రవీణ్‌రెడ్డి, రాపోలు నర్సయ్య, రాపోలు శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, కూన చంద్రయ్య, తిరుపతి, బుర్ర రవి తదితర గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

పదేళ్ల ప్రస్థానం.. అభివృద్ధికి నూతన పయనం

గన్నేరువరం మండల ఐక్యతను కాపాడుకుంటూ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.