కాచాపూర్ పంచాయతీలో రికార్డుల తనిఖీ
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహించాలి: డీపీఓ జగదీశ్వర్ శంకరపట్నం, అక్టోబర్ 12 (చైతన్యగళం): శంకరపట్నం మండలంలోని కాచాపూర్ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జగదీశ్వర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. వాటి నిర్వహణ తీరును తనిఖీ చేసి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని రికార్డులు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డీపీఓ జగదీశ్వర్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ ఊకంటి మాధవి ఆయనను...