అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి – కలెక్టర్‌ చిత్రా మిశ్రా

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి భూముల రీసర్వేను సమన్వయంతో పూర్తి చేయాలి కరీంనగర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, భూముల రీసర్వే ప్రక్రియను సమన్వయంతో విజయవంతంగా ముగించాలని సూచించారు. సోమవారం రాత్రి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్‌...