ప్రభుత్వ ఉపాధ్యాయులు.. పరుగుల యోధులు!
30 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన కోహెడ ఉపాధ్యాయులు హుస్నాబాద్/కోహెడ, అక్టోబర్ 11 (చైతన్య గళం): ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూనే పరుగుల పోటీల్లో పాల్గొంటూ క్రీడాస్ఫూర్తిని చాటుతున్నారు కోహెడ మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కొండమీది హరిప్రసాద్, అమ్మిగల్ల రమేష్. మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అటవీ పునరుద్ధరణ పరుగు పోటీలో వీరిద్దరూ 30 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేశారు. దట్టమైన అడవులు, ఎత్తుపల్లాలతో కూడిన క్లిష్టమైన మార్గంలో ప్రకృతి ఒడిలో పరుగెత్తి తమ పట్టుదల, శారీరక...