మహాశక్తి ఆలయంలో వైభవంగా నవరాత్రి వేడుకలు
రెండో రోజు లింగార్చనలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం కరీంనగర్, అక్టోబర్ 12 (చైతన్యగళం): కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సాయంత్రం నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రీదేవి అలంకారంలో జగన్మాత...