సవారన్ స్ట్రీట్‌లో అగ్నిప్రమాదం
గ్యాస్ లీకేజీతో వంటగదిలో మంటలు.. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది కరీంనగర్, అక్టోబర్ 11 (చైతన్యగళం): కరీంనగర్‌లోని సవారన్ స్ట్రీట్‌లో ఆదివారం సాయంత్రం సుమారు 5.15 గంటల సమయంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకొచ్చి ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వంటగదికే పరిమితం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించలేదు. ఇరుకైన రహదారి ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది...