CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 7:56 am Posted by : CHAITHANYA GALAM NEWS

సవారన్‌ స్ట్రీట్‌లో అగ్నిప్రమాదం

  • గ్యాస్‌ లీకేజీతో వంటగదిలో మంటలు.. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది

కరీంనగర్‌, అక్టోబర్‌ 11 (చైతన్యగళం): కరీంనగర్‌లోని సవారన్‌ స్ట్రీట్‌లో ఆదివారం సాయంత్రం సుమారు 5.15 గంటల సమయంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వంటగదిలో ఉన్న గ్యాస్‌ సిలిండర్లను బయటకు తీసుకొచ్చి ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదం వంటగదికే పరిమితం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించలేదు. ఇరుకైన రహదారి ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉన్నట్లు తెలిసింది.

ఘటనాస్థలాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌ఓ) పరిశీలించి, సత్వరమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బందిని అభినందించారు.