శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు

ప్రత్యేక పూజలు, చండీయాగం, హోమాలతో ఆధ్యాత్మిక శోభ మహబూబాబాద్, అక్టోబర్ 11(చైతన్యగళం): శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీ దుర్గా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, చండీయాగం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ప్రారంభించి కలశ స్థాపన, సర్వతోభద్ర మండప ఆరాధన, కంకణధారణ, అఖండ దీపారాధన నిర్వహించారు....