లింగాపూర్ అభివృద్ధికి సహకరించండి
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసిన సర్పంచ్ మోరే స్వరూపా రవి శంకరపట్నం, అక్టోబర్ 12 (చైతన్యగళం): మండలంలోని లింగాపూర్ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మోరే స్వరూపా రవి సోమవారం కరీంనగర్‌లో కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల వివరాలను ఆయనకు వివరించి, వాటి మంజూరుకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రాధాన్య...