CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 10:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

లింగాపూర్‌ అభివృద్ధికి సహకరించండి

  • కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసిన సర్పంచ్‌ మోరే స్వరూపా రవి

శంకరపట్నం, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): మండలంలోని లింగాపూర్‌ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ మోరే స్వరూపా రవి సోమవారం కరీంనగర్‌లో కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల వివరాలను ఆయనకు వివరించి, వాటి మంజూరుకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు.

గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించాలని సర్పంచ్‌ కోరారు. దీనిపై బండి సంజయ్‌ కుమార్‌ సానుకూలంగా స్పందించి, లింగాపూర్‌ గ్రామ అభివృద్ధికి అవసరమైన పనుల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌ మోరే స్వరూపా రవి చేస్తున్న ప్రయత్నాలపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు గౌరవేని శ్రీనివాస్‌, మోరే రవి, సందెల రంజీత్‌ తదితరులు పాల్గొన్నారు.