రాహుల్ గాంధీ భేటీ అభ్యర్థనను తిరస్కరించిన సీజేఐ
ఎస్‌ఐఆర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ అంశాలు కోర్టు పరిధిలోనే.. న్యాయపరంగా ఆశ్రయించవచ్చని స్పష్టీకరణ ఢిల్లీ(చైతన్యగళం): ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరిన భేటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించినట్లు సమాచారం. ఈ అంశాలు ఇప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం సముచితం కాదని సీజేఐ కార్యాలయం ఈమెయిల్ ద్వారా తెలిపినట్లు సంబంధిత...