తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక
తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనం.. పూలనే పూజించే అరుదైన పండుగ గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, అక్టోబర్ 12 (చైతన్యగళం): బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలిచే ఈ పండుగను ప్రజలంతా ఐక్యంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో...