సన్న వడ్ల గుర్తింపునకు సాంకేతిక నిపుణుల నియామకం
అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం నెలకు రూ.15 వేల గౌరవ వేతనం.. అక్టోబర్ 15 చివరి తేదీ మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా, వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం...