CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 10:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తిమ్మాపూర్‌ సీఐగా బి. అనిల్‌ నియామకం

తిమ్మాపూర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ సర్కిల్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా బి. అనిల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మల్టీజోన్‌-1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటివరకు తిమ్మాపూర్‌ సీఐగా విధులు నిర్వహించిన బొల్లం రమేష్‌ సస్పెన్షన్‌కు గురికావడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ప్రస్తుతం రామగుండం సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న అనిల్‌ను తిమ్మాపూర్‌కు బదిలీ చేశారు. ఆయన త్వరలోనే నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు.