పితృపక్షాల్లో శ్రీ వాసవి సేవా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

2,500 మందికి అన్నదానం.. 140 మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రదానం మానుకోట(చైతన్యగళం): పితృపక్షాల సందర్భంగా శ్రీ వాసవి సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మానుకోటలో 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సుమారు 2,500 మందికి నారాయణ సేవ పేరుతో అన్నదానం చేయడంతో పాటు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న 140 మంది కార్మికులకు వస్త్రదానం చేసి, భోజనం అందించారు. సమాజసేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఈ కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్లేట్లను వినియోగించారు....