ఎస్వీ టవర్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పూల పండుగలో మహిళల సందడి!
మహబూబాబాద్(చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర్ బోర్డు ప్రాంతంలో ఉన్న ఎస్వీ టవర్స్‌లో మహిళలు ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఒక్కచోట చేరి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పూల పండుగతో ఎస్వీ టవర్స్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక అని అన్నారు....