మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన వొడితల ప్రణవ్

కరీంనగర్ అక్టోబర్ 10 (చైతన్యగళం): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకానికి సంబంధించిన నిధుల విడుదలతో పాటు నియోజకవర్గంలో దళితుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.