దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులకు పోలీసులకు ముందస్తు సమాచారం తప్పనిసరి: ఏసీపీ సదానందం హుస్నాబాద్, అక్టోబర్ 10 (చైతన్యగలం): దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, మండపాల నిర్వాహకులు పోలీసుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. దుర్గాదేవి విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులు నిర్వహించదలచిన నిర్వాహకులు తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా ముందస్తు సమాచారం అందించడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ ఫారాలను సమర్పించాలని...