CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:16 am Posted by : CHAITHANYA GALAM NEWS

సిద్ధిపేట జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. పదేండ్ల పండుగకు తరలిరావాలి

హుస్నాబాద్, అక్టోబర్ 9 (చైతన్యగళం):

ఈ నెల 11న నిర్వహించే పదేండ్ల పండుగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి: మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు, రాబోయే పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ, సిద్ధిపేట జిల్లా ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే “పదేండ్ల పండుగ” కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీన హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట హుస్నాబాద్పట్టణం ల లోని , నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రతి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించడంతో పాటు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే గ్రామ శాఖల కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపడతానని తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను చురుకుగా కొనసాగించాలని సూచించారు.

ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.