సుదర్శన్‌ చారి మరణం సీపీఐకి తీరని లోటు

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్‌ హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం): హుస్నాబాద్‌ మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకుడు, మాజీ మండల కార్యదర్శి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు, తాలూకా కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించిన వలువొజు సుదర్శన్‌ చారి మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, హుస్నాబాద్‌ మాజీ ఉప ఎంపీపీ గడిపె మల్లేశ్‌ అన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్‌ చారి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం...