ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆసుపత్రులకు దూరంగా ఉండాలి – నిమ్స్‌ డైరెక్టర్‌ ఇన్‌చార్జి మార్త రమేష్‌

హుస్నాబాద్‌,అక్టోబర్ 9(చైతన్యగళం): ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోపాటు సమాజసేవ, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో హుస్నాబాద్‌ పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ ప్రాంగణంలో హుస్నాబాద్ పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమావేశంలో నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ ఇన్‌చార్జి మార్త రమేష్‌ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని, వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చికిత్స కంటే...