ఓటరు జాబితా సవరణలో నిబంధనలు పాటించాలి

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అధికారులకు ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ ప్రశాంతి ఐఏఎస్‌ హెచ్చరిక నందికొట్కూరు, అక్టోబర్ 10(చైతన్యగళం)‌: నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఐఆర్‌–2026 ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ ప్రశాంతి ఐఏఎస్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆరు మండలాలకు చెందిన ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, ఇప్పటికే నమోదైన వివరాల సవరణకు సంబంధించి ఫారం–6, ఫారం–7, ఫారం–8...