పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను యజమానికి అందజేసిన పోలీసులు

కరీంనగర్ , అక్టోబర్ 10 (చైతన్యగళం): దుర్షేడ్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి వెంకటయ్య ఇటీవల కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్‌లో తన ఒప్పో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయమై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ (CEIR) టెక్నాలజీ సహాయంతో సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేసి జగిత్యాలలో గుర్తించారు. అనంతరం సెల్‌ఫోన్‌ను దాని యజమాని కవ్వంపల్లి వెంకటయ్యకు ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి అందజేశారు. సెల్‌ఫోన్‌ను గుర్తించడంలో కృషి చేసిన టెక్ టీమ్ కానిస్టేబుళ్లు చిట్యాల రాంసాయి, భుక్య రమేష్‌లను సీఐ...