అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికైన శివాంశికకు మంత్రి పొన్నం అభినందనలు
జాతీయ స్థాయిలో రజత పతకంతో సత్తా చాటిన క్రీడాకారిణికి సత్కారం హుస్నాబాద్ , అక్టోబరు 9 (చైతన్యగళం): జమ్మూలో నిర్వహించిన అండర్-17 జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రజత పతకం సాధించి, ప్రపంచ యువ కామన్వెల్త్ పోటీలకు ఎంపికైన చెస్ క్రీడాకారిణి, డబ్ల్యూసీఎం, డబ్ల్యూఎఫ్‌ఎం బిరుదులు పొందిన శివాంశికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న వయసులోనే చెస్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో...