పంట పండిస్తే దొంగల పాలు.. కన్నీరుమున్నీరైన కర్షకుడు!
మొక్కజొన్న చేనులో కంకుల చోరీ.. అర ఎకరా పంటకు నష్టం నీటి ఎద్దడిని తట్టుకొని సాగు చేస్తే.. చేతికొచ్చే వేళ దొంగల దెబ్బ! గడివేముల(చైతన్యగళం): ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు చివరకు కన్నీరే మిగిలింది. ఎండలు, నీటి కొరతను తట్టుకొని పంటను కాపాడుకుంటూ వచ్చిన అన్నదాతకు గుర్తుతెలియని వ్యక్తులు కోలుకోలేని దెబ్బ తీశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామానికి చెందిన కురువ వేణుమాధవ్ సాగు చేసిన మొక్కజొన్న పంటలో కంకులను దొంగిలించడంతో తీవ్రంగా నష్టపోయారు. కష్టపడి పండించిన పంటను...