ప్రజాసేవకు అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా!

చైర్మన్‌ పోటీకి సిద్ధమంటున్న జనసేన సీనియర్‌ నాయకుడు మాసమ్‌ సాహెబ్‌ నందికొట్కూరు, అక్టోబర్ 10(చైతన్యగళం): జనసేన పార్టీ తనకు మున్సిపల్‌ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన మాసమ్‌ సాహెబ్‌ తెలిపారు. ప్రజాసేవకు అవకాశం లభిస్తే పట్టణంలోని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న...