నవభారత్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
హుస్నాబాద్ అక్టోబర్ 9 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో పాఠశాల కరస్పాండెంట్ గంగరవేణి రవి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ పాల్గొని బతుకమ్మను పేర్చారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడి అందరినీ అలరించారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో...