జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

హుస్నాబాద్ ,అక్టోబర్ 9(చైతన్యగళం): ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలను జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వీ లలిత మాట్లాడుతూ పువ్వులను దేవతలుగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని తెలుపుతూ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ఆత్మగౌరవానికి, ప్రకృతి...