CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 11:27 am Posted by : CHAITHANYA GALAM NEWS

జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

హుస్నాబాద్ ,అక్టోబర్ 9(చైతన్యగళం):

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలను జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వీ లలిత మాట్లాడుతూ పువ్వులను దేవతలుగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని తెలుపుతూ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మహిళల జీవన విధానానికి ప్రతికగా నిలిచే అద్భుతమైన పూల పండుగ అని పేర్కొన్నారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డి కర్ణాకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం అని తెలుపుతూ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే విశిష్టమైన పూల పండుగ అని తెలిపారు అనంతరము మహిళా అధ్యాపక బృందము మరియు అధ్యాపకేతర బృందము ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు ఆటపాటలతో ఆడి పాడారు. మహిళా అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థుల యొక్క ఆటపాటలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కర్ణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందము డి రవీందర్, ఎస్ సదానందం, టి నిర్మలాదేవి, B.లక్ష్మయ్య ,ఏ సంపత్, ఎస్ కవిత, కే స్వరూప ,జీ కవిత, ఆస్మా ఫిర్దూస్, ఓ రాణి , జూనియర్ అసిస్టెంట్లు K.గీతాంజలి ,ఎస్ రాములు, రికార్డ్ అసిస్టెంట్ టి రమాదేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగువారు పాల్గొన్నారు.