CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 9:13 pm Posted by : rakeshkashaveni12@gmail.com

మహాశక్తి దేవాలయంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్ అక్టోబర్ 10 (చైతన్యగళం):

ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయ ప్రాంగణం కన్నుల పండువగా మారింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు అపర్ణతో కలిసి పాల్గొన్నారు. పలువురు భక్తులు, ఇతరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.