మాంటిస్సోరిలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి.. పూల పండుగతో పాఠశాలలో పండుగ శోభ హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్‌ పట్టణంలోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు, సందడితో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ మన్నన్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ...