రైతుల విద్యుత్‌ సమస్యలపై బీఆర్‌ఎస్‌ ధర్నా

అక్కన్నపేట విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ఆందోళన.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం): అక్కన్నపేట మండలంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్‌ మాజీ శాసనసభ్యుడు వొడితెల సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించామని...