దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.. దివ్యాంగుల భవనానికి స్థలం కేటాయించాలి కర్నూలు, అక్టోబరు 8 (చైతన్యగళం): జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ ప్రతినిధులు గురువారం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్ 34 ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో దివ్యాంగుల భవన నిర్మాణానికి 10 సెంట్ల స్థలం కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు...