CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 6:02 am Posted by : CHAITHANYA GALAM NEWS

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

  • ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి.. దివ్యాంగుల భవనానికి స్థలం కేటాయించాలి

కర్నూలు, అక్టోబరు 8 (చైతన్యగళం‌): జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్‌ ప్రతినిధులు గురువారం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్‌ 34 ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ అమలు చేసి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

ప్రతి జిల్లాలో దివ్యాంగుల భవన నిర్మాణానికి 10 సెంట్ల స్థలం కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోనూ స్థలం కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు బోయ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బొగ్గుల అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.