సీఎం పర్యటన భద్రతపై సమీక్ష

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వంగూరు, అక్టోబరు 9 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు రానున్న నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రత, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి పూజలు నిర్వహించనున్న ఆంజనేయస్వామి, శివాలయం, కోటమైసమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఆలయాలను అలంకరించాలని అధికారులను ఆదేశించారు....