CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 6:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సీఎం పర్యటన భద్రతపై సమీక్ష

  • పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

వంగూరు, అక్టోబరు 9 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు రానున్న నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రత, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ముఖ్యమంత్రి పూజలు నిర్వహించనున్న ఆంజనేయస్వామి, శివాలయం, కోటమైసమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఆలయాలను అలంకరించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని, పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

సమావేశంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, డివిజన్‌, మండల స్థాయి అధికారులు, స్థానిక సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.