- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: ప్రిన్సిపాల్ థాకూర్ కిన్నెర
పటాన్‌చెరు, అక్టోబరు 9 (చైతన్యగళం): పటాన్‌చెరు మండలం సాయికాలనీలోని కల్యాణ్స్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉత్తమ బతుకమ్మగా ఎంపికైన రెండో తరగతి విద్యార్థిని దేవులపల్లి వామిక శ్రీ వర్షకు పాఠశాల ప్రిన్సిపాల్ థాకూర్ కిన్నెర బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రకృతి పండుగ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీలత, జరీనా, ఇంద్ర, భాగ్యశ్రీ, శిరీష, భాగ్యలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.