CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 10:28 pm Posted by : rakeshkashaveni12@gmail.com

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శ

రామగుండం అక్టోబర్ 09 (చైతన్యగళం)

రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ శుక్రవారం అంతర్గం, పాలకుర్తి మండలాల్లో పర్యటించి ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని, ఎలాంటి కష్టం వచ్చినా మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన సమయంలో తన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు.