ఓపీఎస్ అమలు ఆర్థిక భారం అనడం సరికాదు
సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతనూ పరిగణనలోకి తీసుకోవాలి: దర్శన్‌గౌడ్ హైదరాబాద్, అక్టోబరు 9 (చైతన్యగళం): పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందన్న వ్యాఖ్యలు సరికావని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్‌గౌడ్ అన్నారు. ఓపీఎస్ అమలుపై జయప్రకాశ్ నారాయణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆయన ఖండించారు. దశాబ్దాలపాటు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించడం సామాజిక బాధ్యత అని దర్శన్‌గౌడ్ పేర్కొన్నారు. పెన్షన్‌ను కేవలం ఆర్థిక...