కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం):
కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ వీధి దీపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి స్విచ్ ఆన్ చేసి లైట్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు, కర్రే అనిల్, బీజేపీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.