వర్షాభావంపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం): రాష్ట్రంలో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, విద్యుత్, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉండగా, 320 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు సీఎస్ తెలిపారు. సాధారణ...