చిన్నారుల ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు

గీతాంజలి స్కూల్‌లో సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి కోహెడ, అక్టోబరు 9 (చైతన్యగళం): మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో గీతాంజలి స్కూల్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చిన్నారులకు తెలియజేయడంతోపాటు వారిలో సాంస్కృతిక అవగాహన, సమష్టి భావన పెంపొందించేందుకు వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్‌ తాటిపాముల శ్రీనివాస్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ శాలిని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.