రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి
సాగర్, శ్రీశైలం నుంచి సాగునీరు విడుదల చేయాలి: టీడీపీ నాయకుడు పోగుల సైదులు గౌడ్ నల్గొండ, అక్టోబరు 9 (చైతన్యగళం): రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పగటిపూట కనీసం 12 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు పోగుల సైదులు గౌడ్ డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని పంటలను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. విద్యుత్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో రైతులకు...