ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి

కరీంనగర్, అక్టోబర్ 8 (చైతన్యగళం): ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఏర్పడే నీటి ఎద్దడిని ఎదుర్కోవడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానంలో భాగంగా రైన్‌వాటర్ హార్వెస్టింగ్, రూఫ్‌టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాట్లు, స్థలాల గుర్తింపు, ప్రణాళిక సిద్ధం తదితర అంశాలపై చర్చించారు....