ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

కరీంనగర్ అక్టోబర్ 8 (చైతన్యగళం): ప్రజావాణి, సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, బర్త్ అండ్ డెత్ తదితర విభాగాల హెడ్ అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రజావాణితో పాటు ప్రజావాణి, ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ అధికారులు, సిబ్బంది, కార్మికుల బయోమెట్రిక్ హాజరు, వేతనాల చెల్లింపులు తదితర...