అవయవ దానంపై అపోహలు వీడాలి -జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షుడు పరకాల రవీందర్‌రెడ్డి

మహబూబాబాద్, అక్టోబర్ 8(చైతన్యగళం): అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షుడు, లయన్ పరకాల రవీందర్‌రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ మాన్యత ఆధ్వర్యంలో నేత్ర, రక్త, అవయవ, మరణానంతర శరీర దానాల ప్రాధాన్యతపై గురువారం మానుకోట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షురాలు వేలూరి శ్యామలాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల రవీందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. అవయవ దానం...