కరీంనగర్ అక్టోబర్ 8(చైతన్యగళం):
దుర్షేడ్ గ్రామానికి చెందిన కర్ర అజయ్ గత సంవత్సరం దుర్షేడ్‌లో తన ఒప్పో సెల్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. దీనిపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేసి మంథనిలో గుర్తించారు.
అనంతరం సెల్‌ఫోన్‌ను యజమాని కర్ర అజయ్‌కు ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి అందజేశారు. సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుళ్లు చిట్యాల రాంసాయి, భుక్య రమేష్‌లను సీఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు.