బాలికలు చదువుతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలి
క్షణిక ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దు.. సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి మహబూబాబాద్(చైతన్యగళం): క్షణిక ఆకర్షణలు, ఆనందాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి స్వాతి మురారి విద్యార్థినులకు సూచించారు. కష్టపడి చదివి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి సొంత కాళ్లపై నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్ 11న నిర్వహించనున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్‌లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు....