గౌరవెల్లి ఉపకాలువ భూసేకరణపై రైతుల ఆందోళన
సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు.. న్యాయం జరిగే వరకు భూములు ఇచ్చేది లేదని స్పష్టీకరణ హుస్నాబాద్, అక్టోబరు 8 (చైతన్యగళం): గౌరవెల్లి ప్రాజెక్టు ఉపకాలువ భూసేకరణకు వచ్చిన సర్వే అధికారులను హుస్నాబాద్ సబ్స్టేషన్ సమీపంలో రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఇప్పటికే హుస్నాబాద్–కరీంనగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం ఎకరం వరకు భూములు కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఉపకాలువ నిర్మాణం కోసం మరో ఎకరం వరకు భూమిని సేకరించేందుకు అధికారులు సర్వేకు రావడంపై అభ్యంతరం తెలిపారు. రహదారులు, కాలువల...